Posts

Showing posts from July, 2024

అనంతపురంలో ఎయిరోపోర్టు కట్టాలని వినతి!!ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వినతిపత్రం సమర్పించారు. Airport in Anantapur

Image
ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వినతిపత్రం సమర్పించారు.   అనంతపురంలో ఎయిర్ పో ర్టుతో పాటు విమానయాన సిబ్బంది శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహనను అనంతపురం, హిందూపురం MPలు కోరారు. ఉద్యాన పంటలైన పూలు, పండ్లు, కూరగాయల ఎగుమతితో పాటు ప్రయాణికుల అవసరాలు తీర్చేలా ఎయిర్పోర్టు ఉండాలని ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వినతిపత్రం సమర్పించారు. ఎయిర్పోర్టు నిర్మాణం కరవు పీడిత ప్రాంతానికి వరంగా మారడంతోపాటు, యువతకు ఉపాధి లభిస్తుందన్నారు.

నేడే తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ" Hyderabad PrajaBhavan

Image
  తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు నేడు(శనివారం) భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో నీటి పంపిణీపై ఎలాంటి చర్చలు ఉండవని సమాచారం.

ఏ నారాయణపురం పంచాయతీలో రంగనాథ్ బ్రాహ్మణ తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ సీనియర్ కార్యకర్త ఆర్థిక సాయం చేసిన రాయల మురళి! Tapovanam Royal Murali

Image
 ఏ నారాయణపురం గ్రామపంచాయతీలో తపోవనం లో నివసిస్తున్న రంగనాథ్ బ్రాహ్మణ తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ సీనియర్ కార్యకర్త షుగర్ వ్యాధితో బాధపడుతూ గత వారంలో కర్నూల్ లో కాలు తీసివేయడం జరిగింది   కర్నూల్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ ఇంటికి వచ్చిన రంగనాథ్ ను పరామర్శించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాయల్ మురళి, బూత్ ఇంచార్జ్ జయప్రకాష్, బాల, వెంకటలక్ష్మి , వరాలమ్మ, వెంకటరాముడు, గాండ్ల ఆదినారాయణ, హాజీ వలి, మాసూలు చంద్ర , వడ్డే హరికుమార్ తదితరులు రంగా ఇంటికి వెళ్లి ధైర్యంగా ఉండు విషయాన్ని స్థానిక శాసనసభ్యులు దృష్టికి తీసుకుపోయి నీకు న్యాయం చేస్తామని తెలియజేశారు ప్రస్తుతం వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం చేసిన రాయల్ మురళి .   ఆర్థిక సహాయం అందించిన రాయల మురళి