నేడే తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ" Hyderabad PrajaBhavan
తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలు నేడు(శనివారం) భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ ప్రజాభవన్లో ఇరువురు సమావేశం కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై చర్చించనున్నారు. 9వ షెడ్యూల్, 10వ షెడ్యూల్లోని సంస్థల పంపిణీ, విద్యుత్ సంస్థలపై ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో నీటి పంపిణీపై ఎలాంటి చర్చలు ఉండవని సమాచారం.
Comments
Post a Comment