జిల్లా జడ్జిని కలిసిన బహుజన లాయర్స్ ఫోరం డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు చేయాలి! Bahujan lawyars!

అనంతపురం జిల్లా జడ్జి గారిని కలిసిన బహుజన్ లాయర్స్ ఫోరం అనంతపురం జిల్లా జడ్జి శ్రీనివాసులు గారిని అనంతపురం బహుజన్ లాయర్స్ ఫోరం కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి రాజ్యాంగ పీఠికను ఇచ్చి, సుప్రీంకోర్టు ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విధంగానే హైకోర్టులో మరియు జిల్లా కోర్టు ఆవరణంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, కోర్టు హాలుయందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేయాలని విన్నవించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు : బి.నారాయణప్ప బహుజన లాయర్స్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్, బడిగి నారాయణ హానరబుల్ ప్రెసిడెంట్ అనంతపురం, బహుజన లాయర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మూర్తి గారు, జనరల్ సెక్రెటరీ మహేశ్వరి, అడ్వకేట్లు గంగప్ప గారు, రమేష్ గారు, హరి గారు, మరియు జయరాజు గారు..తదితరులు పాల్గొన్నారు...