కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన 75 వ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ జయహో# GTV Telugu live news
కర్నూలు జిల్లా మంత్రాలయం. నియోజవర్గంలో 75 వ రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా జయహో జానయ్య పాట జై భీమ్ ఎమ్మార్పీఎస్ కోసిగి మండల అధ్యక్షుడు వికలాంగుడు రాజేష్ చేతులు మీద విడుదల
జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన 75 వ రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ జయహో జానయ్య అనే పాటను సొగనూర్ ఆనంద్ రచించి పాడడం జరిగింది. ఈ పాటను కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం ఘనంగా రాజ్యాంగ దినోత్సవం పురస్కరించుకొని అంబేద్కర్ విగ్రహం నుండి రాగసుధ లాడ్జి వరకు భారీగా ర్యాలీ చేపట్టి, పాటను విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా జై భీమ్ ఎమ్మార్పీఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడుతూ... *పేదింటి కుసుమం ఆనందు పాటను ఢిల్లీకి పరిచయం చేపిస్తానని* మంత్రాలయం నియోజకవర్గం సినీ పరిశ్రమలాగా ఈ ఆడియో ఫంక్షన్ జరగడం గర్వకారణం. ఈరోజు అన్ని కులాలు సమానంగా జీవిస్తున్నారు మాట్లాడుతున్నారు అంటే రాజ్యాంగం పుణ్యమే, రాబోయే రోజుల్లో అంబేద్కర్ సిద్ధాంతాన్ని మరింత మంత్రాలయంలో నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షులు ముత్తు సుమల, జై భీమ్ ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా నాయకులు ప్రశాంత్ కుమార్, సత్యన్న, రత్నం, మంత్రాలయం నియోజకవర్గ ఇన్చార్జి సంఘటి యోహాను, మంత్రాలయం నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనీల్ కుమార్,మారెప్ప జై భీమ్ ఎమ్మార్పీఎస్ పెద్దకడబూర్, కోసిగి, మంత్రాలయం, కౌతాళం, ఎమ్మిగనూరు, ఆదోని,సూగురు వగరూరు వీ తిమ్మాపురం చెట్నపల్లి, రచ్చుమరి, చిలకలదోన, చట్నాపల్లి, బూదూరు, కళ్ళు దేవకుంట, తదితర జై భీమ్ ఎమ్మార్పీఎస్ గ్రామ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Comments
Post a Comment