Posts

Showing posts from October, 2025

ఓ.సి. విద్యార్థి యువగర్జన – సమాన హక్కుల కోసం ఓ.సి. యువత గళం! OC Yuva Garjana

Image
  అనంతపురం నగరంలో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 10:30 గంటలకు లలితకళా పరిషత్ వేదికగా జరగబోతున్న “ఓ.సి. విద్యార్థి యువగర్జన”  ఓ.సి. విద్యార్థి యువగర్జన – సమాన హక్కుల కోసం ఓ.సి. యువత గళం అనంతపురం నగరంలో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 10:30 గంటలకు లలితకళా పరిషత్ వేదికగా జరగబోతున్న “ఓ.సి. విద్యార్థి యువగర్జన” కార్యక్రమం సమాజంలో సమాన హక్కుల కోసం ఓ.సి. యువత ఒకే వేదికపై ఐక్యమవుతున్న ఘట్టంగా నిలవనుంది. ఈ సభలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఓ.సి. ఉద్యోగ సంఘాల నాయకులు, మేధావులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొననున్నారు. “మేలుకుందాం – ఐక్యమవుదాం – పోరాడుదాం – సాధిద్దాం” అనే నినా దంతో ఓ.సి. యువత తమ హక్కుల సాధన కోసం కదలికకు సిద్ధమవుతోంది. ప్రస్తుత పరిస్థితి 75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో, ఇతర వర్గాలకు రిజర్వేషన్ల వలన విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఓ.సి. వర్గానికి నష్టాలు ఏర్పడినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అగ్రవర్ణాలు అన్న పేరుతో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఓ.సి. ప్రజలను నిర్లక్ష్యం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అగ్రకుల పేదలు కూడా తీవ్ర ...

బహుజన సమాజ్ పార్టీకి కొత్త ఊపు | అనంతపురం నియోజకవర్గానికి కే. నరేంద్రబాబు నాయకత్వం## Bahujan Samaj party

Image
  దళిత, బలహీన వర్గాల కోసం పోరాటం కొనసాగిస్తా – బి.ఎస్.పి. నేత కే. నరేంద్రబాబు బహుజన సమాజ్ పార్టీకి కొత్త ఊపు | అనంతపురం నియోజకవర్గానికి  కే. నరేంద్రబాబు నాయకత్వం అనంతపురం నియోజకవర్గ బి.ఎస్.పి. అధ్యక్షుడిగా  కే. నరేంద్రబాబు ఎంపిక బహుజన సమాజ్ పార్టీ 19వ కాంసీరాం వర్ధంతి సందర్భంగా అనంతపురం నియోజకవర్గ బి.ఎస్.పి. అధ్యక్షుడిగా  కే. నరేంద్రబాబు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ వందన్ కుమార్, రాయలసీమ జోనల్ ఇన్‌చార్జ్ గద్దల నాగభూషణం, జిల్లా ఇన్‌చార్జ్ కాసాని నాగరాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ — “నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నిరంతరం పోరాడతాను. సమాజంలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ బలహీన వర్గాల సాధికారత కోసం కృషి చేస్తాను” అని తెలిపారు .

న్యాయవ్యవస్థకు చెర చిన్నితే: సాకే నరేష్ ఆవేదనపూరిత ఫైర్! Is law Sake Naresh

Image
  సుప్రీం కోర్టు సీజేఐ పై దాడి పిరికిపందల చర్య సాకేనరేష్ అనంతపురం జిల్లా   : G9tvnews   సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయ్ పై ఒక మనువాది దాడి చేయడం పిరికిపందల చర్య అని బిసి రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాకేనరేష్ తీవ్రంగా ఖండించాడు, సుప్రీం కోర్టు సీజేఐ పై దాడి చేయడం అంటే ఈ దేశ రాజ్యాంగంపైన దాడి చేయడమే అని, సుప్రీం కోర్టు ప్రజాస్వామ్యనికి ప్రాణం, న్యాయం కోరిన ప్రతిపౌరుడు చివరి ఆశ్రయం మన హక్కులు స్వేచ్ఛ న్యాయవ్యవస్థలపైన ఉన్న విశ్వాసాన్ని నిలుస్తాయని అటువంటి మహాత్తరమైన సంస్థకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గవాయ్ పై దాడి వ్యక్తిపై దాడి కాదు భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యం పై దాడి అని ఇలాంటి దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బీసీఆర్పీఎస్ డిమాండ్ చేస్తోంది.