బహుజన సమాజ్ పార్టీకి కొత్త ఊపు | అనంతపురం నియోజకవర్గానికి కే. నరేంద్రబాబు నాయకత్వం## Bahujan Samaj party

దళిత, బలహీన వర్గాల కోసం పోరాటం కొనసాగిస్తా – బి.ఎస్.పి. నేత కే. నరేంద్రబాబు
బహుజన సమాజ్ పార్టీకి కొత్త ఊపు | అనంతపురం నియోజకవర్గానికి
కే. నరేంద్రబాబు నాయకత్వం
అనంతపురం నియోజకవర్గ బి.ఎస్.పి. అధ్యక్షుడిగా
కే. నరేంద్రబాబు ఎంపిక
బహుజన సమాజ్ పార్టీ 19వ కాంసీరాం వర్ధంతి సందర్భంగా అనంతపురం నియోజకవర్గ బి.ఎస్.పి. అధ్యక్షుడిగా
కే. నరేంద్రబాబు ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ వందన్ కుమార్, రాయలసీమ జోనల్ ఇన్‌చార్జ్ గద్దల నాగభూషణం, జిల్లా ఇన్‌చార్జ్ కాసాని నాగరాజు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నరేంద్రబాబు మాట్లాడుతూ —
“నా మీద ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు. దళితులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల కోసం బహుజన సమాజ్ పార్టీ సిద్ధాంతాల ప్రకారం నిరంతరం పోరాడతాను. సమాజంలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ బలహీన వర్గాల సాధికారత కోసం కృషి చేస్తాను” అని తెలిపారు.
Comments
Post a Comment