ఓ.సి. విద్యార్థి యువగర్జన – సమాన హక్కుల కోసం ఓ.సి. యువత గళం! OC Yuva Garjana
అనంతపురం నగరంలో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 10:30 గంటలకు లలితకళా పరిషత్ వేదికగా జరగబోతున్న “ఓ.సి. విద్యార్థి యువగర్జన”

ఓ.సి. విద్యార్థి యువగర్జన – సమాన హక్కుల కోసం ఓ.సి. యువత గళం
అనంతపురం నగరంలో అక్టోబర్ 31వ తేదీన ఉదయం 10:30 గంటలకు లలితకళా పరిషత్ వేదికగా జరగబోతున్న “ఓ.సి. విద్యార్థి యువగర్జన” కార్యక్రమం సమాజంలో సమాన హక్కుల కోసం ఓ.సి. యువత ఒకే వేదికపై ఐక్యమవుతున్న ఘట్టంగా నిలవనుంది.
ఈ సభలో జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నేతలు, ఓ.సి. ఉద్యోగ సంఘాల నాయకులు, మేధావులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, వివిధ కుల సంఘాల నాయకులు పాల్గొననున్నారు. “మేలుకుందాం – ఐక్యమవుదాం – పోరాడుదాం – సాధిద్దాం” అనే నినా
దంతో ఓ.సి. యువత తమ హక్కుల సాధన కోసం కదలికకు సిద్ధమవుతోంది.
ప్రస్తుత పరిస్థితి
75 సంవత్సరాల స్వాతంత్ర్య భారతదేశంలో, ఇతర వర్గాలకు రిజర్వేషన్ల వలన విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఓ.సి. వర్గానికి నష్టాలు ఏర్పడినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అగ్రవర్ణాలు అన్న పేరుతో ప్రభుత్వం, రాజకీయ పార్టీలు ఓ.సి. ప్రజలను నిర్లక్ష్యం చేశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అగ్రకుల పేదలు కూడా తీవ్ర ఆర్థిక కష్టాల్లో జీవనం సాగిస్తున్నారని, వ్యవసాయ రంగంలో గిట్టుబాటు ధరలు లేక రైతులు వలసలు వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన డిమాండ్లు
జాతీయస్థాయిలో ఓ.సి. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి.
టెట్ పరీక్షలో ఓ.సి. అర్హత మార్కులు 90 నుండి 70కు తగ్గించాలి.
ప్రతి మండలంలో ఓ.సి. సంక్షేమ హాస్టళ్లు ఏర్పాటు చేయాలి.
పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు వయోపరిమితి పెంచాలి.
ఓ.సి. యువతకు ఉపాధికోసం సబ్సిడీ లోన్లు ఇవ్వాలి.
అర్హులైన ప్రతి అభ్యర్థికి ఇ.డబ్ల్యు.యస్. సర్టిఫికెట్లు మంజూరు చేయాలి.
Comments
Post a Comment