హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి August 15th BJP
హర్ గర్ తిరంగా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలి*
బిజెపి జిల్లా అధ్యక్షులు శ్రీ *సంధిరెడ్డి శ్రీనివాసులు* ఆధ్వర్యంలో
భారతీయ జనతా పార్టీ అనంతపురం జిల్లా R&B గెస్ట్ హౌస్ లో నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశం ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ సంధి రెడ్డి శ్రీనివాసులు గారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి బాధ్యతలు తీసుకున్నాక ఆగస్టు 15న భారతదేశమంతా కూడా ఒక పండుగ లాగా చేస్తున్నారని , కేంద్ర ప్రభుత్వం హర్ గర్ తిరంగ అభియాన్ అనే పేరుతో ప్రతి ఇంటి మీద జెండా ఎగిరేయాలని దేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయునికి దేశభక్తి పెంపొందించేలా కార్యక్రమాలు తీసుకొందని వాటిలో ప్రతి నియోజకవర్గంలో ఆగస్టు 11,12 ,13వ తేదీల్లో తిరంగ యాత్ర పేరుతో బైక్ ర్యాలీలు నిర్వహించడం, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేసి పూలమాలలు వేయడం, ఆగస్టు 14న *విభజన విభీషక సంస్కరణ దివాస్* పురస్కరించుకొని హాల్ సమావేశాలు నిర్వహించడం అన్ని ఇల్లు వ్యాపార సంస్థల పైన త్రివర్ణ పథకాన్ని ఎగిరివేయడం ఆగస్టు 15వ తేదీ ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరవేయాలని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి సూచన మేరకు జాతీయ భావంతో ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకోవాలని వారు జిల్లా ప్రజలను కోరారు.
ఈ యొక్క కార్యక్రమంలో పార్లమెంట్ సంయోజక్ లలిత్ కుమార్ జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గోంది అశోక్ ,జిల్లా కార్యదర్శి ఈశ్వర్, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఇలియాజ్,ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు రంజిత్ నాయక్, శివ,ఆశావాది రవికుమార్ ,చిరంజీవి, తేజ తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment