మునిసిపల్ కమీషనర్ గా పనిచేసిన దివాకర్ రెడ్డి గారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వున్నాయి. Rayadurgam Municipal commissioner fraud

 


 అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గతంలో మునిసిపల్ కమీషనర్ పనిచేసిన దివాకర్ రెడ్డి తిరిగి మునిసిపల్ కమీషనర్గా బాధ్యతలు చేపడుతున్న విషయం మాదృష్టికి వచ్చింది ఈయన అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి - నిజాయితీ పరులైన వారిని కమీషనర్ నియమించాలని విజ్ఞప్తి చేయుచున్నాము.
మునిసిపల్ కమీషనర్గా పనిచేసిన దివాకర్ రెడ్డి గారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వున్నాయి. 

మునిసిపాలిటీకి సంబంధించిన ఎంతో విలువైన స్థలాలను వై.ఎస్.ఆర్. పార్టీ నాయకులకు కట్టబెట్టడం, కబ్జాలకు గురైనా పట్టించుకోకపోవడం, వారికి వత్తాసు పలకడం జరిగింది.
రాయదుర్గం మునిసిపాలిటీ పబ్లిక్ హెల్త్ వర్కర్ నుండి పర్టినెంట్ వర్కర్ బదిలీ పేరుతో నెలకు రూ॥ 15,000/- లు ఒక్కొక్కరి నుండి ప్రతి నెలా వసూలు చేసినాడని తెలిసినది. అదేవిధంగా బెట్ సోర్సింగ్ పి. హెచ్, వర్కర్లనుండి రూ॥.7,000/- లు ఒక్కొక్కరినుండి వసూలు చేసినారని తెలిసింది. వర్కర్లు అబ్సెంట్ అయినప్పుడు ప్రజంట్ వేసి శాలరీ పెట్టాలంటే పర్మినెంట్ వర్కర్లకు రోజుకు 1000/- లు కాంట్రాక్టు వర్కర్లకు రూ. 500/- చొప్పున నెలలో లక్షలాది రూపాయలు శానిటరీ ఇన్స్పెక్టర్కు ఇవ్వాలి.వారికి రావాలసిన పనిమట్లు గంపలు, పారలు, కర్జీలు, గునపాలు, లెక్కల్లో వందలు చొప్పున ఇచ్చినట్లు రికార్డు నమోదు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఏమీ కనిపించడం లేదు.
వర్కర్ల రక్షణ నిమిత్తం వాళ్ళకి రావాల్సిన గ్లోజులు, మాస్కులు, గ్యాంగ్ షూస్, చెప్పులు, బట్టలు, యూనిఫామ్లు ఒక్కరికి కూడా లేవు. క్షేత్రస్థాయిలో వర్కర్లకు కనిపించవు. రికార్డులలో మాత్రం లక్షల్లో అవినీతి సొమ్ము వుంది.
కార్మికుల ఆరోగ్యం, మందులు, హెల్త్ క్యాంపులు జరిపినట్లు సృష్టించి నిధులు స్వాహా చేసినాడు. రికార్డుల్లో మాత్రం ఎవరికి దొరకకుండా గల్లంతు చేస్తున్నారు.
బ్లీచింగ్ సున్నం ప్యాకెట్లు సంవత్సరానికి ఎంత స్టాకు తీసుకువస్తున్నారనేది రహస్యంగా వుంచుతూ ఉదా: 100 ప్యాకెట్లు తీస్తే 500 ప్యాకెట్లకు బిల్లు పెడతారు. అదేవిధంగా సెక్రటరీలకు సచివాలయం చొప్పున ఎంత ఇస్తున్నారనేది కూడా రహస్యంగానే పెడుతున్నారు. సంతకాలు అసలు తీసుకోరు, వీటికి రెండు రికార్డులు మెయింటెన్ చేస్తున్నారు. విజిలెన్స్ వారికి చూపడానికి ఒక రికార్డు, బిల్లులు పెట్టుకోవడానికి ఒక రికార్డు కొన్ని లక్షల అవినీతి, అక్రమాలు చేస్తున్నారని తెలిసింది.
డీజిల్ అవినీతి: రాయదుర్గం మునిసిపాలిటీలో మూలన పెట్టిన వెహికల్సు, కావాలనే

రిపేరి పేరుతో మూలన పెట్టిన వెహికల్స్ ట్రాక్టర్లు టిప్పర్లు, ఆటోలకు నడుపుతున్నా ఒక్క వెహికల్కి రీడింగ్ లేదు. జిపియస్ సిస్టమ్ లేదు. ఉద్దేశ్యపూర్వకంగా తొలగించి. నిబంధనలకు విరుద్ధంగా వందల లీటర్లు డీజిల్ స్వాహా చేస్తున్నారు.
వాళ్ళసొంత వాహనాలకు మరియు సొంత వాళ్ళకు కావాల్సిన నాయకులకు, 8 వాహనాలకు, లీడర్లకు లెక్కలేనన్ని లీటర్లు ప్రతిరోజు స్వాహా చేస్తున్నారు. ముఖ్యంగాకార్మికులను వారి సొంత ఇంటి పనిమనుషులుగా అధికారులు, అక్కడున్న నాయకులు కొంతమంది వాడుకొంటున్నారు.
రాయదుర్గం మునిసిపాలిటీకి సంబంధించిన ఏ పనులైన ప్రజలు చేయించుకోవాలంటే ప్రతి దానికి ఒక రేటు పెట్టి వసూలు చేస్తున్నారు. ఇందుకు కొంతమంది సిబ్బందిని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా డబ్బు సంపాదించినారు. దీని వలన రాయదుర్గం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడినారు.

ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని, ఎన్నికల అనంతరం తిరిగి అడే వ్యక్తిని ఎందుకు నియమిస్తున్నారు అనేది అర్ధం కావడం లేదు. కనుక రాయదుర్గం బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, క్రింది స్థాయి ఉద్యోగులకు సరైన న్యాయం జరగాలంటే ఆయన నియామతాన్ని ఆపి ఆయన స్థానంలో ఒక నిజాయితీ గల అధికారి రాయదుర్గం మునిసిపల్ కమీషనర్గా నియమించాలని మిమ్మల్ని కోరుతున్నాము. బహుజన సమాజ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు

Comments

Popular posts from this blog

అనంతపురం చేనేత ఐక్య కులాల వివాహా వేదిక సమావేశం ,శ్రీ అంపావతి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో! Chenetha I kyamarriage

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener