రాచానపల్లి పంచాయతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు సమక్షంలో, ఘనంగా గ్రామ సభలు! Village Development
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, రాప్తాడు నియోజకవర్గం శాసనసభ్యులు గౌరవనీయులు "పరిటాల సునీతమ్మ గారి ఆదేశాల మేరకు
రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్ మండలం రాచానపల్లి పంచాయతిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికారులు సమక్షంలో, ఘనంగా గ్రామ సభలు నిర్వహించడం జరిగింది"*
గ్రామాలు అభివృద్ధి సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత గ్రామ ప్రజలదే అని తెలియజేయడం జరిగింది..
ఈ సందర్భంగా గ్రామంలో మంచినీటి సౌకర్యాలు మెరుగుపరచాలని, సిమెంట్ రోడ్లు, లింకు రోడ్లు నిర్మించాలని, విద్యుత్ సమస్యలు వీధి దీపాలు, కరెంటు పనులు వేగవంతం చేయాలని, డ్రైనేజీ పనులు చేపట్టాలని, పండ్లు తోటలు మల్బరీ తోటలను అభివృద్ధి పరచాలని, పశువుల షెడ్లు ఏర్పాటు చేయాలని తెలియజేయడం జరిగింది"
*గ్రామాల అభివృద్ధి బాటలో నడవాలంటే తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పలువురు నాయకులు అధికారులు తెలియజేశారు*
గ్రామ ప్రజలు పలు సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో సెక్రెటరీ,ఐసిడిఎస్, ఎంపీడీవో, పశుసంవర్ధక శాఖ, ప్రభుత్వ అధికారులతో పాటు కన్వీనర్ సూర్యనారాయణ, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, "ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి "సాకే వీరాంజనేయులు", గ్రామ అధ్యక్షుడు బద్దెల మంజునాథ్, డీలర్ పసల ఆదినారాయణ, బిల్లా నాగరాజు, ఆంజనేయులు, ఓబులేసు, ఈశ్వర్ రెడ్డి, సతీష్ రెడ్డి, రఫీ, మరియు కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు"..తెలుగుదేశం పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకే వీరాంజనేయులు*
Comments
Post a Comment