డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి సందర్భంగా మంత్రాలయం టౌన్ నందు ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహనికి # G9 TV Telugu live news
కర్నూలు జిల్లా
మంత్రాలయం.లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి జరుపుకున్న మంత్రాలయం జై భీమ్ ఎమ్మార్పీఎస్ మండల కమిటీ
కర్నూలు జిల్లా మంత్రాలయం టౌన్ నందు జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం నియోజకవర్గ నాయకులు దేవరపాటి అనిల్ కుమార్, మంత్రాలయం మండల అధ్యక్షులు గాడిమోడి నరసింహులు మాదిగ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68 వ వర్ధంతి సందర్భంగా మంత్రాలయం టౌన్ నందు ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహనికి జై భీమ్ ఎమ్మార్పీఎస్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గర్జి హనుమన్న మాదిగ జిల్లా కార్యదర్శి రత్నం మాదిగలు పూలమాల వేసి నివాళులు అర్పించి మాట్లాడుతూ మహా మేధావి ప్రపంచ జ్ఞాని న్యాయ కోవిదుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు ఎన్నో కష్టాలు పడి డిగ్రీలు పీజీలు పూర్తిచేసి భారతదేశ తల అయినటువంటి భారత రాజ్యాంగం నిర్మించడం జరిగింది. ఆయన పడిన అవమానాలు అంటరానితనం బడిలో గుడిలోకి రానీయకుండా ఉండిన వదలలేదు ఇకముందు ఈ దేశంలో నాలాంటి అవమానం నా జాతి బిడ్డలకు జరగకూడదని ఎన్నో పోరాటాలు చేసి జ్ఞానముతో ఈరోజు మనం ఇలా ఉండడానికి మన మహనీయుడు న్యాయకోవిధుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భిక్ష అని సగర్వంగా చెప్పగలమని అన్నారు ఈ కార్యక్రమానికి జై భీమ్ ఎమ్మార్పీఎస్ మంత్రాలయం మండల, నియోజకవర్గ నాయకులు M.B. జక్కయ్య, మడ్రి. మారెప్ప, మడ్రి. శివ,రాజన్న, డేవిడ్, శేఖర్,రాజు తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment