వసతి గృహపూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో! క్యాలెండర్ ఆవిష్కరణ! మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం # G9 TV Telugu live news G9 TV Telugu live news





మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థులు ఆర్థిక సహాయం

 అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో మృతులు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించిన పూర్వ విద్యార్థుల సంఘం.
 

నార్పల: ఇటీవల గార్లదిన్నె సమీపంలోని బస్సు ఆటోను ఢీకొన్నప్రమాదంలో గాయపడిన పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలకు క్షతగాత్రులు కుటుంబాలకు నార్పల బాలుర వసతి గృహం పూర్వ విద్యార్థులు అండగా నిలిచి చేయూతనందించారు. ఆదివారం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలోని మృతి చెందిన ఈశ్వరయ్య కొండమ్మ దంపతులు నాగమ్మ నాగన్న దంపతులు రామాంజనమ్మ ,బాల పెద్దయ్య జయరాముడు, నాగమ్మ తదితర కుటుంబాలతో పాటు క్షతగాత్రుల కుటుంబాలకు ఇంటింటికి వెళ్లి 50 వేల రూపాయలను ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు లక్ష్మయ్య స్వామి బొమ్మలాటపల్లి వెంకటరాముడు, పెద్దన్న మాట్లాడుతూ గ్రామంలో అంతా పేదలేనని వీరి కుటుంబాలు జీవనాధారం కోసం గార్లదిన్నె మండలానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలతొ అక్కడికక్కడే మృతి చెంది ఎన్నో కుటుంబాల్లో చీకటిని నింపారన్నారు. వీరికి ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. తమ వంతుగా ప్రతి కుటుంబానికి తమ పూర్వపు విద్యార్థులలో ఉన్నతంగా ఎదిగిన వారు తదితరులు కలిసి సామూహికంగా 50 వేల రూపాయలను సేకరించి అందజేశామన్నారు.ఒకరికొకరు సాయంగా ఉంటూ తమ కుటుంబాల వారికే అండగా నిలవడమే తమ సంఘ ధ్యేయమన్నారు. మా పూర్వ విద్యార్థుల కలయిక ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటుందని తెలియజేశారు.

పూర్వ విద్యార్థుల సంఘం 2025 ఏడాదికి సంబంధించినటువంటి నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు. ఎల్లుట్ల బుగ్గ సమీపంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం సన్నిధిలో బాలుర వసతి పూర్వ విద్యార్థులు అందరూ కలిసి మన సంతోషాన్ని పంచుకున్నారు. 2025 సంవత్సరంలో అంతా మంచి జరగాలని. మా స్నేహితులు ఇంకా ఎక్కడున్నా కలుసుకొని మా పూర్వ విద్యార్థుల సంఘం లోకి చేర్చుకుంటాము కలిసి ఉంటే కలదు సుఖం. మీడియాతో మాట్లాడుతూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
 ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య స్వామి, వెంకటరాముడు, సూరి ,మిద్దెకుల్లయప్ప పెద్దన్న తదితర సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు బాలసంజప్ప.నారాయణస్వామి, పాత్రికేయడు లక్ష్మీనారాయణ ,డిసి పెద్దయ్య, మిద్దె కుళ్లాయప్ప ,గుజ్జల వెంకటరాముడు.వేణుగోపాల్. సుధాకర్,ఓబులేసు, గూగూడు కుల్లాయప్ప ,ఏసి కుల్లాయప్ప లక్ష్మయ్య , నాగరిక బూసినారాయణస్వామి, రామాంజనేయులు తదితరులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

 

Comments

Popular posts from this blog

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

పూజ పేరుతో ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి! G9tvlivenews