సచివాలయం ఉద్యోగ సమస్యలపై మా సంపూర్ణ మద్దతు - BSP రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు! BSP party
సచివాలయం ఉద్యోగ సమస్యలపై మా సంపూర్ణ మద్దతు - BSP రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు
సచివాలయం ఉద్యోగులకు అన్యాయం జరిగితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. 1,23,000 మంది ఉద్యోగుల్లో 90% మా బహుజన ఉద్యోగులే ఉన్నారు.
మూలిగే నక్క మీద తాటికాయపడినట్టు ఉంది సచివాలయం ఉద్యోగుల పరిస్థితి.
గత ప్రభుత్వమే వాళ్ళ సచివాలయ వ్యవస్థని స్థిరీకరించకుండా , క్రమబద్ధం లేకుండా, జాబ్ చాట్ , మెరిట్ లిస్టు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకుండా గాలికి వదిలేసి పోతే ,అదే ఉద్యోగులు కొత్త ప్రభుత్వాన్ని ఓటేసి ఎన్నుకున్నందుకు ఈ ప్రభుత్వం తీవ్ర అన్యాయమే చేస్తుంది.
*రేషనలైజేషన్* పేరుతో వాళ్లును మోసం చేయాలని చూస్తుంది. 1 లక్ష,23 వేల ఉద్యోగులు *నీ* *ప్రమోషన్ ఏంటి అని ప్రశ్నిస్తే* ఎవరు చెప్పలేని పరిస్థితిలో ప్రభుత్వ పరిపాలన ఉంది అంటే ఎంత సిగ్గుచేటు అర్థం చేసుకోవచ్చు,
వాలంటీర్ వ్యవస్థని తీసివేయడం వాలంటీర్ల పని సెక్రటరీలతోనే చేయించడం వల్ల చివరికి పెద్ద పాలేరుగా వాళ్ల పరిస్థితిగా మారింది. సచివాలయం ఉద్యోగులందరికీ *జాబ్ ఉంది కానీ* *జాబ్ చాట్ లేదు* MSME servey ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ వర్క్నీ,APCOS banks సర్వే బ్యాంకులు చేసే డ్యూటీ, NPCI,Gio tag, ఇలాంటి సర్వేలన్నీ ఒక ఏజెన్సీ ద్వారా చేయించకుండా వాళ్లకు సంబంధంలేని వర్కులన్నీ ,జాబ్ చాటు అమలు చేయకపోవడం వల్ల దాదాపు మిగిలిన డిపార్ట్మెంట్లు ఏ వర్క్ ఉన్న సచివాలయం ఉద్యోగులకే అప్పగించి బలవంతంగా , నోటీసులు ఇచ్చి ,సస్పెండ్ చేస్తామని బెదిరించి కేవలం వాళ్ళని అటెండర్ ,ఆఫీస్ బాయ్ కంటే హీనంగా పనిచేపిస్తున్నారు. ఒక్కొక్క ఇంటికి సర్వే పేరుతో కొన్ని వందల సార్లు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాగా కొన్ని వందల ఇల్లు ఒక్కొక్క సెక్రటరీకి అప్పగించారు.
ఇప్పటికీ రాష్ట్రంలో DA ,IR,PRC అమలు ,నోషనల్ ఇంక్రిమెంట్ పెండింగ్ ఉన్న, ఆర్థిక విషయాలు సంబంధం లేని పెన్, పేపర్తో సాల్వ్ అయ్యే సమస్యలు యునప్పటికీ ఒక్కటి కూడా పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలను ఒక *PHD చేసిన* *వాళ్ళని పాలేరు మేస్త్రీలుగా చేసే* *జీవో నెంబర్ 423* ఇప్పటికీ వెనక్కి తీసుకోకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట.
ప్రధానమైన డిమాండ్లు:*
1) ఉద్యోగుల అభీష్టం మేరకు మాతృ శాఖలో విలీనం చేయాలి
2) GO 423 రద్దు చేసి శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీలకు కూడా 10am to 5pm టైమింగ్స్ పెట్టాలి
3) మెరిట్ లిస్ట్ ఇచ్చి ప్రమోషన్ చానల్ ని వెంటనే ప్రకటించాలి
4) గతంలో పెండింగ్లో ఉన్న DA,IR, PRC, నోషనల్ ఇంక్రిమెంట్ ,
ప్రమోషన్లను వెంటనే ప్రకటించాలి. ఈ విషయాన్ని *రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు దృష్టికి, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, సచివాలయ మంత్రి గారికి, చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం.
డిమాండ్లు నెరవేరని పక్షంలో మా బహుజన ఉద్యోగుల సమస్యలకై బహుజన ఉద్యోగ సంఘాలు మరియు ఇతర ఉద్యోగ సంఘాలు అన్నింటితోను మమేకమై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి నాంది పలుకుతామని విజ్ఞప్తి చేస్తున్నాం
Comments
Post a Comment