త్రాగునీటి కోసం 167వ జాతీయ రహదారి పై మహిళలు ఖాళీ బిందెలతో బటాయింపు! Mantralayam water problem
భారీగా రోడ్డుపై నీటి బిందెలతో ధర్నా. భారీగా వాహనదారులకు అంతరాయం
మంత్రాలయం నియోజకవర్గంలో నీటి కొరత :
మా G9tvNews : ప్రతినిధి రవి
త్రాగునీటి కోసం 167వ జాతీయ రహదారి పై మహిళలు ఖాళీ బిందెలతో బటాయింపు
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామంలో నెల రోజులుగా త్రాగునీటి సరఫరా లేక దాదాపు 1000 మందికి పైగా మహిళలు 167వ జాతీయ రహదారిపై ఖాళీ బిందెలతో బైఠాయించి ప్రభుత్వానికి మరియు సంబంధిత అధికారులకు తమ నిరసన వ్యక్తపరిచారు. దీనితో కిలోమీటర్ మేర ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడి వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.ఇప్పటికైనా అధికారులు మొద్దు నిద్ర వీడి త్రాగునీటి సరఫరా సమస్యను పరిష్కరించవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు.
Comments
Post a Comment