మంత్రాలయం మండలంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని!CPM Party Demand
మంత్రాలయం మండలంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని
మంచి నీటి సమస్య వెంటనే పరిష్కరించాలని డిమాండ్ సిపిఎం పార్టీ
మంత్రాలయం మండలంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని *సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.డి అంజిబాబు* పెద్దకడబూరు సిపిఎం పార్టీ ప్రాంతీయ కమిటీ కార్యదర్శి తిక్కన్న డిమాండ్ చేశారు
మంత్రాలయం మండలంలోని మాధవరం చెట్నిపల్లి మంత్రాలయం గ్రామాలలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పక్కనే తుంగభద్ర నది ప్రవహిస్తున్నప్పటికీ మాధవరం గ్రామంలో ప్రజలు మంచినీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు మండలంలోని కళ్ళు దేవ కుంట గ్రామంలో మంచినీటి సమస్య కోసం మహిళలు రోడ్డు ఎక్కిన పరిస్థితి ఉందని తెలిపారు అలాగే మాధవరం గ్రామంలో దళిత కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని తెలిపారు సిమెంటు రోడ్లు వేసినప్పటికీ కాలువలు మురుగునీరు అలాగే నిలబడి వ్యాధులు ప్రబలడానికి కారణం అవుతున్నాయని తెలిపారు అలాగే మాధవరం లో ఇండ్ల స్థలాల సమస్య తీవ్రంగా ఉందని రెండు సెంట్లు స్థలం ఇస్తానని ప్రభుత్వం ప్రకటించిందని ఇంటి స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరారు కరెంటు చార్జీలు పెరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పెంచిన కరెంటు చార్జీలు తగ్గించాలని కోరారు అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని విద్యార్థులకు తల్లికి వందనం పేరుతో ఇస్తామన్న డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు ఇండ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని మంచినీటి సమస్య పరిష్కరించాలని ప్రజా సమస్యల పరిష్కారం కొరకు సోమవారం 24వ తేదీన మండల కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మంత్రాలయం మండలం సిపిఎం పార్టీ కార్యదర్శి జయరాజు మండల నాయకులు మారెప్ప సురేషు ఇజ్రాయిల్ శ్రీనివాసులు ప్రాణేష్ లక్ష్మన్న ఆంధ్రయ అంజి తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment