మంత్రాలయం మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని! ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ధర్నా CPM party


ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ధర్నా 


మంత్రాలయం: మా ప్రతినిధి: రిపోర్టర్ రవి:  G9tvNews 

మంత్రాలయం మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం మండల కార్యదర్శి జయరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా ఎమ్మార్వో ఆఫీస్ వరకు ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ ముందు బైఠాయించి నినాదాలు ఇచ్చారు. అనంతరం మంత్రాలయం తహసిల్దార్ ఎస్ రవికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా నాయకులు అంజి బాబు మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని ఇల్లు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. మండలంలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను వెంటనే తీర్చాలని, ప్రధానంగా మండలంలో నెలకొన్న తాగునీటి కొరత ను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట కొత్త పైపులైను మరి ముఖ్యంగా మంత్రాలయం నుండి కల్లుదేవకుంట గ్రామానికి మరియు కళ్ళు దేవ కుంట గ్రామం గుండా చిలకలదోన గ్రామానికి వేసిన పాత NAP పైపులైను తొలగించి కొత్త పైపులైను వేసి, అలాగే మంత్రాలయం మండల కేంద్రంలో సమ్మర్ స్టోరీజ్ ట్యాంకును ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని గ్రామాలలో నీటి ఎద్దడిని నివారించి, గ్రామాల్లో ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం లో భాగంగా చెల్లించాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని తక్షణమే చెల్లించాలని, నియోజకవర్గ కేంద్రంగా మరియు మండల కేంద్రంగా ఉన్న మంత్రాలయంలో కనీసం వంద పడకల ఆసుపత్రి లేకపోవడం సిగ్గుచేటని వారు ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద కడుబూరు మండల కార్యదర్శి తిక్కన్న, కార్యకర్తలు లక్ష్మన్న,అనిల్,ప్రాణేషు, అంజి, మారెప్ప, సురేషు, వీరేష్, దావీదు తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

పూజ పేరుతో ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి! G9tvlivenews