గిరిజనుడిపై RDT సంస్థలోని కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడం!ATL ( Area Team Leader

 

పూర్తి స్థాయి విచారణ లేకుండా గిరిజనుడిపై RDT సంస్థలోని కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడం సరికాదు !


అనంతపురం జిల్లా స్థానిక ఉరవకొండ పట్టణం నందు నివాసం ఉంటున్న ఎరుకల మల్లికార్జున అనే వ్యక్తి గత 6 సంవత్సరాలుగా RDT (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ) ఉరవకొండ మరియు గుంతకల్లు ప్రాంతాల పరిధిలో గల కార్యాలయాల నందు అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు 


    పూర్తి స్థాయి విచారణ లేకుండా గిరిజనుడిపై RDT సంస్థలోని కొందరు వ్యక్తులు తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేయడం సరికాదు !

  పోలా వీరాంజనేయులు                        

 ఎరుకల యువ సైన్యం అధ్యక్షులు:

అతను విధులు నిర్వహిస్తున్న సమయంలో అతని పై అధికారులు ATL ( Area Team Leader ) గా విధులు నిర్వహించే ఉరవకొండ నందు నల్లపురెడ్డి మరియు గుంతకల్లు నందు వరకుమర్ అనే ఇద్దరు వ్యక్తులు అకౌంటెంట్ గా విధులు నిర్వహిస్తున్న మల్లికార్జున అనే వ్యక్తిని మంచిగా మచ్చిక చేసుకొని తమకు నమ్మకస్తులైన వ్యక్తుల ఖాతాల వివరాలు ఇవ్వాలని అందులో గ్రామ స్వరాజ్య నిధి కి సంబంధించిన నగదు బదలీ చేసి తిరిగి ఆ యొక్క నగదును తమకు లిక్విడ్ క్యాష్ గా ఇవ్వాలని ఆదేశించడం జరిగింది, అయితే బిల్లులు లేకుండా ఆలా చెయ్యడం అసాధ్యమని అందుకు విలు కాదన్నందుకు సదురు మల్లికార్జున అనే వ్యక్తిని ఉద్యోగంలో ఉండాలనీ ఉందా లేదా అంటూ పై అధికారులకు ఎదురు చెప్పి నువ్వు ఉద్యోగం సక్రమంగా చేసుకోగలవా అంటూ బెదరింపులకు పాల్పడటం జరిగింది ఆ క్రమంలో పై అధికారులైన నల్లపురెడ్డి మరియు వర కుమార్ చెప్పిన విధంగా తమకు నమ్మకాస్తులైన 

 ఎదురు చెప్పి ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం ఇష్టం లేక పై అధికారుల ఆదేశాల మేరకు అతను వారు చెప్పినట్టు చెయ్యడం జరిగింది, ఆ క్రమంలో అతను కార్యాలయంలో అతని విధులకు సంబంధించి ఎటువంటి డ్యూస్ పెండింగ్ లేవని రిలివింగ్ లెటర్ లు కూడా ఇవ్వడం జరిగింది,అయితే వారి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో పని ఒత్తిడి తట్టుకోలేక తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు,అయితే రాజీనామా చేసిన తరువాత తమ అక్రమాలను ఎక్కడ బయట పెడుతాడో అనే ఉద్దేశంతో గిరిజనుడైన మల్లికార్జున మీద తప్పుడు కేసులు పెట్టిస్తూ మానసికంగా నలిగిపోయేలా చేసి ఇరోజు ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టేలా ప్రేరేపించడం జరిగింది, ఈ యొక్క స్కాం లో పెద్ద పెద్ద వాళ్ళను వదిలేసి ఒక సామాన్య గిరిజనుడైన మల్లికార్జున అనే వ్యక్తిని బలి చెయ్యడం సరికాదని స్థానిక అనంతపురం అంబేద్కర్ కూడలి నందు ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమంలో ఆవేదన వ్యక్తం చేశారు, నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ అధ్యక్షులు మీసాల శివ మాట్లాడుతూ లక్షల రూపాయిల స్కాం లో పోలీస్ అధికారుల వారు సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు, ఈ కార్యక్రమంలో ఎరుకల ప్రజా సంక్షేమ సంఘం అధ్యక్షులు సాకే చిరంజీవి మరియు ఎరుకల యువ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సాకే ఎర్రి స్వామి నాయకులు జగన్నాథం లోకేష్ దేవరకొండ సురేష్ నాగభూషణం మరియు గిరిజన ఐక్య సదన సమితి అధ్యక్షులు కేశవ నాయక్ మరియు బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

పూజ పేరుతో ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి! G9tvlivenews