కంబదూరు మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ గారి 134 వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా! Surendra Babu MLA# ASB

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది..ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు 






భారతరత్న, డాక్టర్ బాబా సాహెబ్ అంబెడ్కర్ గారి ఆశయాలతో బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మన కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అదే దిశగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తామని *ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు* పేర్కొన్నారు.. 

కంబదూరు మండల టీడీపీ నాయకుల ఆహ్వానం మేరకు *డాక్టర్ బీఆర్ అంబెడ్కర్ గారి 134 వ జయంతి వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు పాల్గొన్నారు* .. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుంచి అంబెడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించి అక్కడే కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో *ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారిని, సీనియర్ నాయకులను ఘనంగా* సన్మానించారు.. ఈ సందర్బంగా *ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ*  అంబెడ్కర్ స్ఫూర్తితో కళ్యాణదుర్గం ప్రాంతంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి కోసం కృషి చేస్తానని, ఇప్పటికే అంబెడ్కర్ ఆశయాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ గారు రాష్ట్ర అభివృద్ధి చేస్తున్నారని, కంబదూరు మండల కేంద్రంలో ఆర్వో ప్లాంటులను నిర్మించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని, అలాగే అంబెడ్కర్ భవన నిర్మాణం కోసం స్థలం చూపించమని ఆర్డీఓ గారికి చెప్పామని త్వరలోనే నిధులు మంజూరు చేయించి భవనం నిర్మిస్తామని హామీ ఇచ్చారు.. కార్యక్రమంలో సీనియర్ నాయకులు చౌలం మల్లికార్జున, కర్లకుంట రామాంజనేయులు, రాష్ట్ర కార్యనిర్వాహాక కార్యదర్శి రామ్మోహన్ చౌదరి, రాష్ట్ర రైతు సంఘం కార్యదర్శి అమిలినేని లక్ష్మీనారాయణ, మాజీ లిడ్ క్యాప్ డైరెక్టర్ ఆవుల తిప్పేస్వామి, మండల పార్టీ అధ్యక్షుడు శివన్న, కళ్యాణదుర్గం మండల పార్టీ అధ్యక్షుడు గోళ్ళ వెంకటేశులు, మాజీ ఎంపీపీ దండా వెంకటేషులు, మాజీ వైస్ ఎంపీపీ తలారి ఎర్రిస్వామి, గాజుల శ్రీరాములు, సురేంద్ర, మాజీ జడ్పీటీసీ కొల్లాపురప్ప, సుబ్బరాయుడు, గోళ్ళ రమేష్, మల్లిపల్లి నారాయణ, రామ్మోహన్ యాదవ్, క్లస్టర్ ఇంచార్జులు రాళ్లనంతపురం నాగరాజు, సన్న తిమ్మరాయుడు, సుధాకర్, బిల్లే ప్రభాకర్, ముత్యాలు, నాయకులు, కార్యకర్తలు జై బీమ్ నాయకులు పాల్గొన్నారు.

.




Comments

Popular posts from this blog

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

పూజ పేరుతో ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి! G9tvlivenews