తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్,యూనివర్సిటీలో డాక్టరేట్ అవార్డుపొందిన పెద్దన్న కు ఘనంగసన్మానించిన ప్రజా సంఘాలు పలువురు నాయకులు! Doctorate Asian International University! Peddanna
డాక్టరేట్ అవార్డు పొందిన పెద్దన్నకు 👆
డాక్టరేట్ పొందిన పెద్దన్నను ఘనంగసన్మానించిన ప్రజా సంఘాలు పలువురు నాయకులు
అనంతపురం జిల్లా : రిపోర్టర్ నాగేంద్ర G9tvNews
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండల కేంద్రంలో తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్,యూనివర్సిటీలో డాక్టరేట్ అవార్డుపొందిన పెద్దన్నను ఆదివారం స్థానిక మండల కేంద్రం కూడేరు లోని భగవతి శివ రావు కళ్యాణ మండపం నందు ఎస్సీ ఎస్టీ బీసీ దళిత సంఘాల నాయకులు విహెచ్పిఎస్, ఎం ఆర్ పి ఎస్, ఎం ఎస్ పి నాయకులు డాక్టరేట్ అవార్డు పొందిన పెద్దన్నను. ఘనంగా సన్మానించారు,
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూడేరు గ్రామ పంచాయితీ సర్పంచ్ లలితమ్మ, స్థానిక ఎంపీటీసీ తోపుదుర్తి వెంకటలక్ష్మి భర్త తోపుదుర్తి రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, ఈ సమావేశానికి సభ అధ్యక్షుడిగా ఆదినారాయణ వహించగా కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధికారి ప్రతినిధిగా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు చేస్తూ, ఉద్యమాలలో ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ వారి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజల సమస్యలను వారి వెంట ఉండి పరిష్కరిస్తూ ఎన్నో ఉద్యమాలను చేపట్టడం జరిగిందని ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాల గురించి తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్ అవార్డు అందుకోవడం కూడేరు మండలానికి ఎంతో గర్వకారణమని పెద్దనను అభినందించారు, మండలం నల్లమల నుండి వచ్చినటువంటి వికలాంగు సోదరులు దళిత సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున కార్యక్రమంలో పాల్గొని అయినను శాలువా కప్పి పూలమాలలు ఘనంగ సన్మానించడం జరిగింది, ఆంధ్రప్రభ విలేకరి ఉరవకొండ నియోజకవర్గం పిసి ఇన్చార్జి మాట్లాడుతూ వికలాంగుడైన పెద్దన్నగత 30 సంవత్సరాల కాలం నుండి ఎంతో ఓర్పు సహనముతో ప్రజల సంక్షేమమే ప్రజాసేవే తన ఊపిరిగ భావించి ఎన్నో అష్ట కష్టాలకు ఎంతో ఓర్పు నేర్పులతో ప్రజల సంక్షేమ కొరకు వికలాంగుల హక్కుల సాధన కొరకు, విద్యార్థుల కొరకు,మహిళల్లో చైతన్యం తీసుకురావడానికివికలాంగులు సమాజంలో గౌరవింపబడే విధంగ ఎన్నో పోరాటాలు చేసిన వికలాంగుడు పెద్దన్నను తమిళనాడు ఆసియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ వారు గుర్తించి ఆయన సేవలను సమాజానికి మరింత తెలిపే విధంగ మరింత పనిచేసే విధంగ డాక్టరేట్ ప్రధానం చేయడం చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు,గతంలో కూడ పెద్దన్న ఎన్నో అవార్డులు రివార్డులు పొందారని వికలాంగుడైన సమాజ సేవలో ప్రజల కోసం పనిచేసే వ్యక్తిగ నిలబడడం చాలా సంతోషకరమైన విషయం అని సంతోషాన్ని వ్యక్తం చేశారు, భవిష్యత్తులో మరిన్ని అవార్డులు రివార్డులు డాక్టరెట్లు పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు ఈసన్మాన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు రాజు, లక్ష్మీనరసప్ప, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పాల ఈశ్వరయ్య, విహెచ్పిస్ మండల అధ్యక్షులు చోళసముద్రము శ్రీరాములు, ఎంఎస్పి ఎంఆర్పిఎస్ నాయకులుసూర్యనారాయణ, ఎస్సీ ఎస్టీ ప్రజాసామక్య మండల అధ్యక్షులు కమ్మూరు కుంటప్ప గారి వన్నూరప్ప, ఉపాధ్యక్షులు ముద్దలాపురం జన్నె ఆంజనేయులు, జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు ఆదినారాయణ, ఇప్పేరు సైలాద్రి, సిపిఐ నాయకురాలు పార్వతీ ప్రసాద్, ప్రజా సంఘాల నాయకులు అరవకూరు రమణ,విశాలాంధ్ర లేఖరి ఎర్రి స్వామి, సిద్ధప్ప, జగన్నాథ్ కదిరప్ప తదితరులు పాల్గొన్నారు
Comments
Post a Comment