ఏపీ బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జూన్ 1న నిర్వహించబోయే మోడల్ లాసెట్ పోస్టర్! Advocated Association
ఏపీ మోడల్ లాసెట్ పోస్టర్ విడుదల :సాకేనరేష్
అనంతపురం :
ఏపీ బీసీ న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జూన్ 1న నిర్వహించబోయే మోడల్ లాసెట్ పోస్టర్ ను అనంతపురం బార్ అసోసియేషన్ లో న్యాయవాదులు విడుదల చేశారు ఈ సందర్భంగా బిసి న్యాయవాదుల సంఘం రాష్ట్ర కన్వీనర్ సాకేనరేష్ మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ మోడల్ లాసెట్ నిర్వహిస్తున్నామని ఇది 9వదని దీని ద్వారా ప్రధాన లాసెట్ రాసే అభ్యర్థులకు ఉపయోగకరంగా ఉంటుందని గతంలో నిర్వహించిన మోడల్ లాసెట్ ప్రశ్నపత్రం లోని అంశాలు ప్రధాన పరీక్షలో వచ్చాయని దానివల్ల ఎంతోమంది లబ్ది పొందారని తెలిపారు కనుక లాసెట్ రాసే అభ్యర్థులు తమ పేర్లు 9441888834, 9985302299, 7799912225 నంబర్స్ కి ఫోన్ చేసి నమోదు చేసుకోవాలని ఈ పరీక్ష జిల్లా కోర్టు ఎదురుగా ఉన్న నెహ్రూ స్కూల్ లో ఉదయం 10 గం. నుంచి 11.30గం., వరకు జరుగునని తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రంగనాయకులు,బాలాజీ నాయక్, మురిపాల నాగేంద్ర, లక్ష్మీనారాయణ, రఘు, భరత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment