దళిత సంఘాలు, హక్కుల, ప్రజాస్వామిక, రాయలసీమ సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించడం! అంతర్యుద్ధం వద్దు - శాంతి ముద్దు.. G9tv live News
అంతర్యుద్ధం వద్దు - శాంతి ముద్దు*
కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల మీద జరుపుతున్న అణిచివేతను, హత్యాకాండను వెంటనే ఆపాలి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరిపి ఆదివాసి ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పడానికి తక్షణమే కాల్పుల విరమణ ప్రకటిస్తూ చర్చల అనుకూల వాతావరణాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తక్షణంమే కల్పించాలని కోరుతూ ఈనెల 25వ తేదీ ఉదయం 10 గంటలకు అనంతపురంలోని కృష్ణ కళామందిర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిర్వహించ తలపెట్టిన శాంతి ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను ఈరోజు ఉదయం 11 గంటలకు అనంతపురంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర *ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక* మరియు *పార్టీల, ప్రజాసంఘాల ఐక్యవేదిక* ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఈ సందర్భంగా కరపత్రాలు ఆవిష్కరించిన ప్రజాసంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ *'కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ కగారును ఆపి, కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని, ఇది కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత'* ని గుర్తు చేస్తూ మాట్లాడారు. అదేవిధంగా *'రాజ్యాంగం ఆదివాసులకు కల్పించిన అనేక హక్కులను కేంద్ర ప్రభుత్వాలు కాలరాస్తూ, వారికి జీవించే హక్కును కూడా లేకుండా చేయడమనేది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రభుత్వాలు చేస్తున్న ఈ హింసకాండ కు వ్యతిరేకంగా ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదికతో ప్రజాసంఘాలుగా కలిసి పోరాడుతామని, అందులో భాగంగా ఈనెల 25వ తేదీ నిర్వహించే శాంతి ర్యాలీని విజయవంతం చేస్తాం'* అని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
కరపత్రాల ఆవిష్కరణకు ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక జిల్లా కన్వీనర్ టి విశ్వనాథ్ వర్మ, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు బండారు అనిల్ కుమార్ నాయకత్వం వహించగా ఈ ఆవిష్కరణకు MRPS రాష్ట్ర కార్యదర్శి కెపి నారాయణస్వామి, జై భీమ్ పార్టీ నాయకులు బికేఎస్ ఆనంద్ పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు ఆదినారాయణ, ఓపిడిఆర్ జిల్లా నాయకులు జి ప్రకాష్, ప్రజా కళామండలి నాయకులు విజయ్, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు కిష్టప్ప, అరుణోదయ కళాకారుడు చంద్రన్న, KNPS నాయకులు ఓబులయ్య, PDM నాయకులు, రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకురాలు కే లక్ష్మి, SC,ST, BC మైనార్టీ నాయకులు ఓబులయ్య, ఎస్సీ ఎస్టీ ప్రజా సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు మద్దెలచెరువు మళ్లీ, ఆల్ ఇండియా ప్రజా హక్కుల పార్టీ జిల్లా నాయకులు నాగరాజు, అడ్వకేట్ చెన్నకేశవులు
దళిత సంఘాలు, హక్కుల, ప్రజాస్వామిక, రాయలసీమ సంఘాలు, మహిళా సంఘాలు పాల్గొని కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది.
అడవులను - ఆదివాసులను కాపాడుకుందాం!*
ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక*
ఉమ్మడి అనంతపురం జిల్లా కమిటీ*
Comments
Post a Comment