ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక! ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం! Government to Demons

 


అనంతపురంలో ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో జరగాల్సిన శాంతి ర్యాలీని పోలీసులు రకరకాల కారణాలతో జరగనీయకుండా ఎక్కడికెక్కడ మన ప్రజా సంఘాల నాయకులను, కార్యకర్తలను అడ్డుకోవడం జరిగింది. అయినా కూడా కొంతమంది మన మిత్రులు అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లి పోలీసుల విధానాలను నిరసిస్తూ నినాదాలతో నిరసన చేయడం జరిగింది. కొంతమందిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకువెళ్లి ప్రయత్నం చేశారు. చాలామందిని ఈ శాంతి ర్యాలీకి రాకుండా అడ్డుకుంటూ వచ్చే వాళ్ల మీద కేసులు పెడతామంటూ బెదిరించి వెనక్కి పంపించేశారు. పోలీసులు అనుసరిస్తున్న ప్రజాస్వామిక హక్కుల ఉల్లంఘనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాట్లాడే స్వేచ్ఛను హరించడమే. ఆదివాసుల మీద, మావోయిస్టుల మీద కేంద్ర రాష్ట్ర బలగాలు జరుపుతున్న నరమేధాన్ని, హత్యాకాండను ప్రజలు గమనిస్తున్నారు. మాట్లాడుతున్నారు. అందులో భాగంగానే ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలు ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండిస్తూ, నిరసిస్తూ శాంతి ర్యాలీలో భాగస్వామ్యం అవుతున్నారు. అది గమనించే అనుమతి ఉన్న కూడా జిల్లా ఎస్పీ ఉద్దేశికపూర్వకంగానే శాంతి ర్యాలీని జరగనీయకుండా అడ్డుకున్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఉద్దేశం పూర్వకంగానే ప్రజాసంఘాలను, మాట్లాడే గొంతుకులను అణిచివేయాలని చూస్తోంది. అందులో భాగంగానే మావోయిస్టు పార్టీ కేంద్ర నాయకులైన *నంబాల కేశవరావు* గారి పార్థివ దేహాన్ని కూడా కుటుంబ సభ్యులకు అప్పగించకుండా కుట్రపూరిత విధానాలను అవలంబిస్తోంది. కూటమి ప్రభుత్వ అనుసరిస్తున్న ఈ విధానాలను *ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక* మరియు *పార్టీల, ప్రజా సంఘాల ఐక్యవేదిక* నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.

   అనంతరం ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించి శాంతి ర్యాలీ నిర్వహించాలనుకున్న ఉద్దేశాలను సభాముఖంగా మాట్లాడడం జరిగింది. 

డిమాండ్స్:-

*కేంద్ర ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి*

*రాజ్యాంగంలోని 5వ, 6వ షెడ్యూల్ ను అమలుపరచాలి*

ఈ కార్యక్రమానికి ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలు పాల్గొన్నాయి.

*ఆదివాసి హక్కుల పోరాట సంఘీభావ వేదిక*

Comments

Popular posts from this blog

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

పూజ పేరుతో ఒక అమ్మాయిని రూమ్ లోకి తీసుకెళ్లి! G9tvlivenews