అల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ మహాసభ - అక్టోబర్ 02.. All India Kisan Janata Party
అనంతపురం జిల్లా అనంతపురం ప్రెస్ క్లబ్ నందు అల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ఆధ్వర్యంలో
జాతీయ మహాసభ - అక్టోబర్ 02
పార్టీ ఆవిర్భావదినోత్సవ సందర్భముగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, కార్యదర్శులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనే జాతీయ మహా సభకు సుమారు 1 లక్ష మందితో నిర్వహిస్తున్న జాతీయ మహాసభను విజయవంతము చేయాలని సంకల్పించడం జరిగింది
తీర్మానాలు - జాతీయఅంశాలు
జమిలి ఎన్నికలు నిర్వహణ ప్రతిపాదన రద్దు చట్టం చేస్తాం.
కేంద్ర దర్యాప్తు స్వతంత్ర సంస్థలు CBI, E D రద్దు చేస్తాం
ఎన్నికల సంఘం కమీషన్ నియామకం మరియు ఇతర రాజ్యాంగబద్ద సంస్థల కమీషన్ల నియామక కమీటిలో (ఎ) సుప్రీం కోర్టు జడ్జి (బి) లోకనభలో అధికారపార్టీ బాధ్యులు (సి) ప్రతివక్ష హోదా కల్గిన పార్టీల / పార్టీ వ్రతివక్ష సభ్యులు ఉండి మెజార్టీ నిర్ణయం ద్వారా ఎంపిక చేస్తాం.
నీటిపారుదల, సాగునీటికి అవసరమయ్యే కాలువలు, డ్యామ్లు, ప్రాజెక్టుల నిర్వహణ మరియు రోడ్డు, రైలు మార్గాలకుఅటవీశాఖ అనుమతులు అవసరము లేకుండా చట్టం చేస్తాం
SBI బ్యాంకును రద్దు చేసి, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చిన, నిల్వ ఉన్న సొమ్మును తిరిగి వెనిక్కి ఇవ్వాలి లేదా రాష్ట్రవతి నిధికి జమ చేస్తాం, 4 జాతీయ బ్యాంకులుగా చేసిన చట్టాన్ని రద్దు చేసి తిరిగి పాత వద్దతి 26-27 జాతీయ బ్యాంకులను తిరగి ఏర్పాటు చేస్తాం.
1-18 వయస్సు వచ్చేంత వరకు (ప్రతి బాల, బాలికలు) విద్యార్థులు విద్యాభ్యానం సొంత గ్రామం లేదా 2 కిలోమీటర్లు లోపల ఉండేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్ది మెరగువరుస్తాం.
సుమారు 100 టియంసి ల నీటి నిల్వతో దేశవ్యాప్తంగా సుమారుగా 1000 డ్యామ్లను నిర్మిస్తాం, 2 నం లోవలే నిర్మించి ప్రజలకు సాగునీటి, త్రాగు నీరు అందేలా చేస్తాం ఇందుకు ఎన్ని ఎత్తిపోతల వధకాలైనా నిర్మిస్తాం.
రైల్వే సౌకర్యం కొత్తగా నుమారుగా 1.50 (ఒక లక్షాయాభైవేలు) కిలోమీటర్లు కొత్త రైల్వే మార్గం చేపట్టి ప్రస్తుతం ఉన్న రైళ్ల సంఖ్యను 35 వేల రైళ్లుగా(34 భోగిలతో) పెంచుతాం.
వయోజన విద్య (B.Tech, M.Tech. Medicene) ను బలోపేతం చేస్తూ JNTU ల సంఖ్యను 4500కు పెంచుతాం ప్రతి శాసన సభకు (ఎ) ఒక Male JNTU (బి) ఒక Female JNTU ఏర్పాటు చేసి (వేరే వేరు ప్రదేశాల్లో / ప్రాంతాలల్లో /మద్య దూరం 50 కిలోమీటర్లు) ఉచితంగా విద్యను అందిస్తాం.
10 ప్రస్తుతం దేశంలో ఉన్న కోర్టులు సంఖ్యను అధనంగా సుమారుగా 40 వేలు గ్రామ కోర్టులు ఏర్పాటు చేసి ఏ అంశాన్ని అయినా 90 రోజుల్లో తీర్పు వచ్చేలా చేసి న్యాయ వ్యవస్థను పొరదర్శకంగా తీర్చిదిద్దుతాం కోలిజియం వ్యవస్థను చట్టబద్దం చేస్తాం.వ్రతి గ్రామాన్ని 40 అడుగులు వెడల్పు తారు రోడ్డుతో దేశం మొత్తానికి అనుసంధానం అయ్యేలా రోడ్లును ప్రభుత్వ ఆధ్యర్యములో నిర్మిస్తాం.
500 ఓటర్లు ఉన్న ప్రతి గ్రామాన్ని ఒక వంచాయతీగా తీర్చిదిద్ది నర్పంచ్, పంచాయతీ రాజ్ వ్యవస్థను కొత్తగా తీర్చిదిద్దుతాం.
ప్రస్తుతం ఉన్న (2004 సం|| వరకు ఉన్న) లోకనభ స్థానాల సంఖ్య 543, రాజ్యనభ స్థానాల సంఖ్య 245, అన్ని రాష్ట్రాల శాసన సభ, మండల స్థానాల సంఖ్యబౌగోళిక స్వరూపం మార్చకుండా, రాష్ట్ర బౌగోళిక స్వరూపం, జిల్లాల భౌగోళిక స్వరూపం మరియు సంఖ్యను మార్చకుండా ఎప్పటికీ అలాగే ఉండేలా పార్లమెంట్ చట్టం తెస్తాం (కొత్త రాష్ట్రాల ఏర్పాటు నిర్మాణం నిషేదం. చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా కిసాన్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జాతీయ అధ్యక్షులు మల్లికార్జున రాష్ట్ర అధ్యక్షులు బాలగొండ.శంకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సత్యనారాయణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పవన్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం అనంతపురం ప్రెస్ క్లబ్ నందు నిర్వహించడం జరిగింది.
Comments
Post a Comment