రాయదుర్గం నియోజకవర్గం బొమ్మణహల్ మండలం నేమకల్లు గ్రామములో దళిత వార్డులో ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తున్న కబ్జాదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజ్ డిమాండ్! BSP party demand
దళిత కాలనీలో ప్రభుత్వ స్థలం అగ్రవర్ణ కులాల కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్:
చిందనూరు నాగరాజు
ఐదు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని దళితుల కోసం కేటాయించకపోతే ఉద్యమిస్తాం.!
అగ్రవర్ణ కులాలు ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బొమ్మణహల్ మండలం నేమకల్లు గ్రామములో దళిత వార్డులో ప్రభుత్వ భూమిని కబ్జాచేస్తున్న కబ్జాదారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి,నియోజకవర్గ అధ్యక్షుడు చిందనూరు నాగరాజు డిమాండ్ చేసాడు.
మంగళవారం స్థానిక దళిత ప్రజలు తమ సమస్యను పరిష్కరించేలా చూడాలని ఆయన కోరారు.అంతకుముందు దళిత కాలనీ వాస ప్రజలు ఆయనను ఎంతో ఆప్యాయంగా తప్పెట్లతో ఘనంగా స్వాగతం పలికి శాలువలతో సన్మానించి స్థలం సమస్యను తెలియజేసారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు మీడియాతో మాట్లాడారు.గత కొన్నేళ్ల క్రితం నుండి దళిత వార్డులో 5 సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కాపాడుకుంటు వస్తున్నారు.అయితే రాజకీయ నాయకుల సహకారంతో అగ్రవర్ణ కులాలు ప్రస్తుతం ఆస్థలాన్ని కబ్జా చేసి నిర్మాణం చేపడుతున్నారన్నారు.వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని ఆ 5 సెంట్ల స్థలాన్ని అంబెడ్కర్ విగ్రహం,కమిటీ హాలుకు కేటాయించాలని డిమాండ్ చేసాడు.లేనిపక్షయం బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో తహశీల్దారు కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఆ స్థలాన్ని అంవేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసేలా చూస్తానని దళిత ప్రజలకు హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా ఐదు సెంట్ల స్థలాన్ని తాము కాపాడుకుంటూ వస్తుంటే ప్రస్తుతం అగ్రవర్ణ కులాలు కబ్జా చేయడం దుర్మార్గమన్నారు. తామేమి తమ ఇంటి కోసం తాపత్రయం పడటం లేదన్నారు దళిత కాలనీ ప్రజల కోసం అంబేద్కర్ విగ్రహం కమిటీ హాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ఏ రాజకీయ పార్టీ నాయకులు తమకు న్యాయం చేయలేదని చిందనూరు నాగరాజుతో వారి ఆవేదనను వ్యక్తపరిచారు.ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ రాయదుర్గం అధ్యక్షుడు జయచంద్ర,తాలూకా ఇన్చార్చి కృష్ణా,గొల్ల నాగరాజు,ఉపాధ్యక్షులు తమ్మెపల్లి రాజు,కోశాధికారి దాసరి గంగాధర తదితర నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Post a Comment