మంత్రాలయం నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రి నిర్మాణం పనులు ప్రారంభించాలి.,. Community Health Centre Hospital
మంత్రాలయం నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రి నిర్మాణం పనులు ప్రారంభించాలి.
మంత్రాలయం G9tvన్యూస్: ప్రతినిధి రవి
మంత్రాలయం నియోజకవర్గంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆస్పత్రి నిర్మాణం పనులు ప్రారంభించాలి. ఏఐవైఎఫ్– మంత్రాలయం మండల కార్యదర్శి ఎం. రాజు డిమాండ్**
కర్నూలు జిల్లాలో మంత్రాలయం నియోజవర్గం ఏర్పడి గత 20 సంవత్సరాలు కావస్తున్న ఇంతవరకు నియోజవర్గ కేంద్రంలో ప్రభుత్వాసుపత్రి లేదంటే సిగ్గుచేటు.మంత్రాలయంలో ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు లేనందున ఉన్నస్థలాలు కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి మఠానికి సంబంధించిన స్థలాలు కాబట్టి యువజన సమైక్య( ఏఐవైఎఫ్ )గా మేము గత కొన్ని నెలల క్రితం శ్రీ మఠం పీఠాధిపతులు సుబుదేంద్ర తీర్థులు గారికి, మాజీ మండల తహశీల్దార్ ఎస్.రవి గారికి స్థలం కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.అందుకు వారు సానుకూలంగా స్పందించి సర్వే నంబర్ 160 లో ఒక ఎకరం స్థలాన్ని కేటాయించడం జరిగింది. వారు కేటాయించిన స్థలంలో ఆసుపత్రి నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించాలని ప్రస్తుత మండల తహశీల్దార్ కె.రమాదేవి మేడం గారికి ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి ఎం.రాజు గారు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపై స్పందించి తక్షణమే ఆసుపత్రి నిర్మాణం పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని యువజన సమైక్యగా మేము డిమాండ్ చేస్తున్నాము. నిర్మాణం పనులు తక్షణమే ప్రారంభించని ఎడల రానున్న రోజుల్లో స్థానికులు,యువకులు విద్యార్థులు, అందరిని మమేకం చేసుకొని పోరాటాలు మరింత ఉదృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ పట్టణ నాయకులు ఎం మురళి డి. ప్రాణేష్, డి. తిమ్మప్ప లు పాల్గొన్నారు.
Comments
Post a Comment