గోపాల్ రెడ్డి, సూర్యచంద్ర రెడ్డి అనే వ్యక్తులు దౌర్జన్యం!వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని...బీసీ ఆర్ దాస్ డిమాండ్ చేస్తూ ఎస్పీ ఆఫీసులో ఫిర్యాదు.. Nithyananda Swami..
పా మిడి పట్టణంలో ఉన్న నిత్యానంద స్వామి ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలని.
గోపాల్ రెడ్డి, సూర్యచంద్ర రెడ్డి అనే వ్యక్తులు దౌర్జన్యం చేస్తున్నారని... వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీకు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు.
బీసీ ఆర్ దాస్ ఆధ్వర్యంలో నిత్యానంద స్వామి శిష్యులు చంద్రశేఖర్,నరసింహులు, పెద్దలయ్య, మద్దిలేటి, పెద్దయ్య, ఇతర మహిళలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భం గా దాసు మాట్లాడుతూ పామిడిలోని నిత్యానంద స్వామి ఆశ్రమంలో నరసింహులు పై గోపాల్ రెడ్డి, సూర్య చంద్రారెడ్డి వ్యక్తులు ఆశ్రమంలోకి వెళ్లి చెప్పు కాలుతో మొకం మీద తిప్పుతూ ఆశ్రమం ఖాళీ చేయకపోతే దళితులను అసలు రాకుండా చేస్తామని, మిమ్ములను తంతే గాని బుద్ధి రాదని దౌర్జన్యం చేశారన్నారు. ఈ విషయం పై తాము పామిడి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని,
ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. నిత్యానంద ఆశ్రమానికి ఆధారాలతో పాటు పట్టణం లో ఆశ్రమ ఆఫీస్ కూడా రిజిస్ట్రేషన్ చేశారన్నారు.
ఇన్ని అధికారాలు ఉండి వారానికి ఒకసారి, అమావాస్య పూర్ణిమ రోజు భజనలు చేస్తూ దాదాపు 60 మంది శిష్యులు ఉపదేశం కూడా పొందుతున్నారని తెలిపారు. కావున జిల్లా ఎస్పీ స్పందించి నిత్యానంద ఆశ్రమానికి రక్షణ కల్పించి... గోపాల్ రెడ్డి, సూర్యచంద్ర రెడ్డి ల పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సూరి, చంద్ర శేఖర్, నరసింహులు, రామాంజీ, శేఖర్, పెద్దలయ్య, శివ, మద్దిలేటి, వికలాంగ పెద్దయ్య, గురు ప్రసాద్, మహిళలు కూడా పాల్గొన్నారు.
Comments
Post a Comment