అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు! Anantha Venkata RamiReddy..., ♨️ MLA in TDP ml fire
మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపాటు...
జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు దుర్మార్గం
– నందమూరి హరికృష్ణ సతీమణిని అవమానిస్తే చర్యలుండవా?
– జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరికతోనే కంటితుడుపు చర్యలు
*– మైనార్టీకి చెందిన మహిళనూ అసభ్యంగా దూషించిన దగ్గుపాటి*
– కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రశాంతమైన అనంతలో పెచ్చుమీరిన దౌర్జన్యాలు
– టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలకు చంద్రబాబు అండ
*– నేను కొట్టినట్టు కొడతా.. మీరు ఏడ్చినట్టు ఏడ్వండి అన్నట్లు బాబు తీరు*
– సాటి నటుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ స్పందించరా?
– వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి
అనంతపురం, ఆగస్టు 23
సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను చంద్రబాబు మందలించినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. సాక్షాత్తూ నందమూరి హరికృష్ణ సతీమణిని అవమానిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు బరితెగించి మహిళల పట్ల కూడా అనుచితంగా మాట్లాడటం, వ్యవహరించడం చూస్తున్నాం. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ పైన దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు వారిని ప్రోత్సహిస్తూ, పైకి మాత్రం వారిపై ఆగ్రహంతో ఉన్నట్లుగా నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి నందమూరి హరికృష్ణ భార్య. స్వర్గీయ ఎన్టీఆర్ కోడలు. నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరికి స్వయాన వదిన. అంటే నందమూరి కుటుంబానికి చెందిన మహిళపైనే, ఎన్టీఆర్ స్థాపించిన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు నోరు పారేసుకుంటే, పైపై మందలింపుల డ్రామాతో సరిపెట్టడానికి చంద్రబాబు ఎందుకు తంటాలు పడుతున్నారు. మీ సతీమణి భువనేశ్వరిపై ఎవరో వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున యాగీ చేసిన చంద్రబాబుకు, తన సోదరి వరస అయ్యే హరికృష్ణ సతీమణి పై సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎందుకు సీరియస్ గా తీసుకోవడం లేదు? నేను కొట్టినట్టు కొడతా.. మీరు ఏడ్చినట్టు ఏడ్వండి అన్న చందాన చంద్రబాబు తీరు ఉంది. నాలుగైదేళ్ల కిందట సోషల్ మీడియాలో మహిళల పట్ల పోస్ట్‌లు పెట్టారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వందల సంఖ్యలో సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లను వెదికి వెదికి పట్టుకుని, జైళ్ళ పాలు చేశారు. మరి మీ పార్టీలోనే ఎమ్మెల్యేలుగా ఉన్న వారు, మీ కుటుంబంలోని ఒక మహిళ పట్ల ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎందుకు కఠినంగా స్పందించడం లేదో చంద్రబాబే చెప్పాలి. సీఎం అండతోనే టీడీపీ ఎమ్మెల్యేలు చెలరేగిపోతున్నారు’’ అని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సాటి నటుడిగా పవన్ కళ్యాణ్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. ఎమ్మెల్యే టిక్కెట్ల కోసం చంద్రబాబుకు, నారా లోకేష్‌కు కోట్ల రూపాయలు ఇచ్చాం... ఇప్పుడు సంపాదించుకోవడం మా హక్కు అని టీడీపీ ఎమ్మెల్యేలు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రశాంతంగా ఉండే అనంతపురంలో కూటమి ప్రభుత్వ వచ్చాక అరాచకాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరాయన్నారు. ఇటీవల అనంతపురంలో మైనార్టీకి చెందిన మహిళను దగ్గుపాటి అసభ్యంగా దూషించారని తెలిపారు. ఇంటి స్థలానికి సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఇలాంటి నాయకులకు ప్రజలు సరైన సమయంలో బుద్ధిచెబుతారని అన్నారు.

Comments
Post a Comment