మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... చిందునూరు నాగరాజు రాష్ట్రకార్యదర్శి విలేకరుల సమావేశంలో Bahujan Samaj party .





 బహుజన సమాజ పార్టీ ఆధ్వర్యంలో 


 రాష్ట్ర కార్యదర్శి రాయలసీమ ఇంచార్జ్. చిందనూరు నాగరాజు 


మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, చిందనూరు నాగరాజు రాష్ట్రకార్యదర్శి విలేకరుల సమావేశంలో మాట్లాడిన అంశాలు..!

వైద్యవిద్యను ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులకు దూరం చేయాలనే చంద్రబాబు కుట్ర.


ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్థులు డాక్టర్ కావాలన్న కల కలగానే మిగిలిపోతుంది.


ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ డాకర్టకు ఉద్యోగ అవకాశాలు దూరం చేస్తున్న ప్రభుత్వం.


రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను కోల్పోతున్న ఎస్సీ, ఎస్టీ, బిసీ, మైనార్టీ విద్యార్థులు మరియు డాక్టర్లు.


మెడికల్ సీట్లు చంద్రబాబు అమ్ముకునే పరిస్థితి వచ్చింది.


పీపీపీ విధానము లంచాల కోసం తమ సామాజిక వర్గం అభివృద్ధి కోసమే.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ చేస్తున్నారని దాని వలన ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థులు డాక్టర్ కావాలన్న కలలను చిదిమేస్తున్నారన్నారు. ఈ క్రమంలో డాక్టర్ సీట్లన్నీ ప్రైవేట్ వ్యక్తులకు సి.ఎం. చంద్రబాబు & పార్టీ అమ్ముకున్నారు.. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ జరిగితే ఎస్సీ, ఎస్టీ, బిసి మైనార్టీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారు. ప్రభుత్వానికి సంబంధించిన నాయకులు ఇతర వ్యక్తులకు మెడికల్ సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల ఆస్తులను 63 సంవత్సరాలకు ఎలా లీజుకు ఇస్తారు. ఏఏపి విధానము లంచాల కోసం తమ సామాజికవర్గం అభివృద్ధి కోసం ఉపయోగపడే విధంగా వుంది. తాజాగా కూటమి ప్రభుత్వం 10 మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడానికి కేబినేట్ నిర్ణయం తీసుకోవడం దారుణం. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రైవేటీకరణ వైపే అడుగులు వేస్తారు. తన కేబినేట్లో వున్న మంత్రి నారాయణ విద్యాసంస్థలు నడుపుతున్న వారికి మెడికల్ కళాశాలలను ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు.

సత్యకుమార్ ఆరోగ్యశాఖ మంత్రిగా వున్నా జిల్లాకు ఎటువంటి ప్రయోజనం లేదు. రాయదుర్గం గవర్నమెంట్ ఆసుపత్రి దుస్థితి రాష్ట్రంలో ఎక్కడ వుండదు. 

మన ఉమ్మడి అనంతపురము జిల్లాలో వున్న ఆరోగ్యశాఖ మంత్రికి జిల్లాలో వున్న డాక్టర్ల కొరతతో పాటు, హాస్పిటల్ అనేకమైన డిపార్టుమెంట్లలో ఉద్యోగుల కొరత అత్యధికంగా వుంది. రాయదుర్గం నియోజకవర్గానికి సంబంధించి ప్రజల ఆరోగ్యంపైన ఎటువంటి బాధ్యత లేకుండా వ్యవహరించడం చాలా బాధాకరంగా వుంది. రాయదుర్గం గవర్నమెంట్ హాస్పిటల్పై మరియు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆయన వెంటనే స్పందించకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఉద్యమ రూపంలో సమాధానం చెపుతుందని తెలియజేస్తున్నాము.

ఈ కార్యక్రమంలో..

బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్లు గొల్ల నాగరాజు కృష్ణ, నియోజకవర్గ అధ్యక్షులు జయచంద్ర, కార్యదర్శి తమ్మేపల్లి రాజు గంగాధర తిప్పేస్వామి తదితర బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు పాల్గొడనం జరిగింది.

Comments

Popular posts from this blog

అనంతపురం చేనేత ఐక్య కులాల వివాహా వేదిక సమావేశం ,శ్రీ అంపావతి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో! Chenetha I kyamarriage

హత్యకు పాల్పడిన వారిని కఠినంగా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తున్న చిందనూరు నాగరాజు!BSP Party# iG9tvLiveMews

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener