రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని AIYF రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది.# AIYF


 


కానిస్టేబుళ్ల శిక్షణ వెంటనే ప్రారంభించాలి – అనంతపురం AIYF జిల్లా సమితి ఆధ్వర్యంలో డిమాండ్*


కానిస్టేబుళ్ల శిక్షణ వెంటనే ప్రారంభించాలి – అనంతపురం AIYF జిల్లా సమితి డిమాండ్s*


అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి రాష్ట్రవ్యాప్తంగా 2022లో ఎంపికైన పోలీస్ కానిస్టేబుళ్ల శిక్షణ తక్షణమే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు నవంబర్ 10, 2025 (సోమవారం) నాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించే కార్యక్రమాన్ని AIYF రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది.
ఈ పిలుపు మేరకు అనంతపురం జిల్లాలో ఏఐవైఎఫ్ వినతిపత్రం సమర్పణ కార్యక్రమం నిర్వహించబడింది.
*ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సచిన్ రాజేంద్ర గారికి వినతిపత్రం అందజేసిన ఏఐవైఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి సంతోష్ కుమార్.*
*ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ* –2022 నవంబరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
తదనంతరం ప్రిలిమినరీ, ఫిజికల్ టెస్టులు, మెయిన్స్ మరియు మెడికల్ పరీక్షలు పూర్తి చేసి, తుది ఫలితాలు ప్రకటించారు.
సుమారు 6,100 మంది యువతులు, యువకులు ఈ నియామక ప్రక్రియలో విజయవంతమయ్యారు.
అయితే, పరీక్షలు పూర్తయి నాలుగేళ్లు గడిచినా ఇప్పటికీ శిక్షణ ప్రారంభం కాలేదు.
దీనివల్ల వేలాది మంది యువత ఆశాభంగానికి, నిరుత్సాహానికి గురవుతున్నారు.
పోలీస్ శాఖలో చేరే అవకాశంతో కుటుంబాలు గర్వపడినా, ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం మరియు ఆలస్యం కారణంగా వారు తీవ్రమైన మానసిక, ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని నాయకులు పేర్కొన్నారు.
ఏఐవైఎఫ్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తక్షణ చర్యలు తీసుకోవాలని, కింది అంశాలను స్పష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు:
*ఎంపికైన 6,100 మంది కానిస్టేబుళ్ల శిక్షణ షెడ్యూల్‌ను వెంటనే ప్రకటించాలి.
*శిక్షణ ప్రారంభంలో జరిగిన అనవసర ఆలస్యానికి బాధ్యత వహించే అధికారులపై చర్యలు తీసుకోవాలనీ కోరారు.
జిల్లా అధ్యక్షులు కోట్రెష్ మాట్లాడుతూ భవిష్యత్తులో ప్రభుత్వ నియామక ప్రక్రియలకు స్పష్టమైన సమయపట్టిక రూపొందించి కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూప్రభుత్వం వెంటనే శిక్షణ షెడ్యూల్ విడుదల చేసి, నియామక ప్రక్రియ పూర్తి చేయాలనీ లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి ఏఐవైఎఫ్ అనంతపురం ఏఐవైఎఫ్ జిల్లా ఉపా అధ్యక్షులు కార్యదర్శులు దేవ. ధనుజయ్ తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

అనంతపురం చేనేత ఐక్య కులాల వివాహా వేదిక సమావేశం ,శ్రీ అంపావతి కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో! Chenetha I kyamarriage

రాజకీయ పబ్బం కోసమే పరిటాల కుటుంబం పై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు ప్రకాష్ రెడ్డి! AtmaKur convener

రాయదుర్గంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన అపచారాన్ని క్షుణ్ణంగా తెలియజేయడం జరిగింది విగ్రహాలను! Bahujan Samaj party