అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు! Anantha Venkata RamiReddy..., ♨️ MLA in TDP ml fire

మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపాటు... జూనియర్ ఎన్టీఆర్‌పై ఎమ్మెల్యే దగ్గుపాటి వ్యాఖ్యలు దుర్మార్గం – నందమూరి హరికృష్ణ సతీమణిని అవమానిస్తే చర్యలుండవా? – జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరికతోనే కంటితుడుపు చర్యలు *– మైనార్టీకి చెందిన మహిళనూ అసభ్యంగా దూషించిన దగ్గుపాటి* – కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రశాంతమైన అనంతలో పెచ్చుమీరిన దౌర్జన్యాలు – టీడీపీ ఎమ్మెల్యేల అరాచకాలకు చంద్రబాబు అండ *– నేను కొట్టినట్టు కొడతా.. మీరు ఏడ్చినట్టు ఏడ్వండి అన్నట్లు బాబు తీరు* – సాటి నటుడిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పవన్ స్పందించరా? – వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి అనంతపురం, ఆగస్టు 23 సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్‌పై అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని అనంతపురం జిల్లా వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిపై అసభ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను చంద్రబాబు మందలించినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. సాక్షాత్తూ నందమూరి హరికృష్ణ సతీ...