మునిసిపల్ కమీషనర్ గా పనిచేసిన దివాకర్ రెడ్డి గారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వున్నాయి. Rayadurgam Municipal commissioner fraud

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గతంలో మునిసిపల్ కమీషనర్ పనిచేసిన దివాకర్ రెడ్డి తిరిగి మునిసిపల్ కమీషనర్గా బాధ్యతలు చేపడుతున్న విషయం మాదృష్టికి వచ్చింది ఈయన అవినీతి, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి - నిజాయితీ పరులైన వారిని కమీషనర్ నియమించాలని విజ్ఞప్తి చేయుచున్నాము. మునిసిపల్ కమీషనర్గా పనిచేసిన దివాకర్ రెడ్డి గారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వున్నాయి. మునిసిపాలిటీకి సంబంధించిన ఎంతో విలువైన స్థలాలను వై.ఎస్.ఆర్. పార్టీ నాయకులకు కట్టబెట్టడం, కబ్జాలకు గురైనా పట్టించుకోకపోవడం, వారికి వత్తాసు పలకడం జరిగింది. రాయదుర్గం మునిసిపాలిటీ పబ్లిక్ హెల్త్ వర్కర్ నుండి పర్టినెంట్ వర్కర్ బదిలీ పేరుతో నెలకు రూ॥ 15,000/- లు ఒక్కొక్కరి నుండి ప్రతి నెలా వసూలు చేసినాడని తెలిసినది. అదేవిధంగా బెట్ సోర్సింగ్ పి. హెచ్, వర్కర్లనుండి రూ॥.7,000/- లు ఒక్కొక్కరినుండి వసూలు చేసినారని తెలిసింది. వర్కర్లు అబ్సెంట్ అయినప్పుడు ప్రజంట్ వేసి శాలరీ పెట్టాలంటే పర్మినెంట్ వర్కర్లకు రోజుకు 1000/- లు కాంట్రాక్టు వర్కర్లకు రూ. 500/- చొప్పున నెలలో లక్షలాది రూపాయలు శానిటరీ ఇన్స్పెక్టర్కు ఇవ్వాలి.వారికి రావాలసిన పని...