మంత్రాలయం మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని! ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ధర్నా CPM party

ప్రజా సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ధర్నా మంత్రాలయం: మా ప్రతినిధి: రిపోర్టర్ రవి: G9tvNews మంత్రాలయం మండల కేంద్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని సిపిఎం మండల కార్యదర్శి జయరాజు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ముందుగా స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి రాఘవేంద్ర సర్కిల్ మీదుగా ఎమ్మార్వో ఆఫీస్ వరకు ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మార్వో ఆఫీస్ ముందు బైఠాయించి నినాదాలు ఇచ్చారు. అనంతరం మంత్రాలయం తహసిల్దార్ ఎస్ రవికి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా నాయకులు అంజి బాబు మాట్లాడుతూ.... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని ఇల్లు లేని ప్రతి పేదవాడికి మూడు సెంట్లు స్థలం కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. మండలంలో నెలకొన్న డ్రైనేజీ, రోడ్ల సమస్యలను వెంటనే తీర్చాలని, ప్రధానంగా మండలంలో నెలకొన్న తాగునీటి కొరత ను దృష్టిలో ఉంచుకొని అవసరమైన చోట కొత్త పైపులైను మరి ముఖ్యంగా మంత్రాలయం నుండి కల్లుదేవకుంట గ్రా...